మినీ గోకులం షెడ్ నిర్మాణ పనులు పరిశీలన

మినీ గోకులం షెడ్ నిర్మాణ పనులు పరిశీలన

బండి ఆత్మకూరు,  న్యూస్ వెలుగు: మండలంలోని సంత జూటూరు గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన మినీ గోకులం షెడ్ల నిర్మాణం పనులను గురువారం ఏపీవో వసుధ పరిశీలించారు. రైతులకు పాడి పశువుల పెంపకానికి అనువుగా మిని గోకులం షెడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. షెడ్ల నిర్మాణానికి రాయితీస్తూ ప్రభుత్వం రైతులకు అండగా ఉందన్నారు. రైతులు త్వరగా మినీగోకులం షెడ్లను నిర్మించుకోవాలని తెలిపారు. మండలంలో 6 మినిగోకులం షెడ్లు నిర్మాణాలు పూర్తి అయ్యాయని 16 నిర్మాణంలో ఉన్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో వెటర్నరీ అధికారి అనూష టెక్నికల్ అసిస్టెంట్ సాములు ఫీల్డ్ అసిస్టెంట జయసూర్య రైతులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!