
వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్మికులకు పీఎఫ్. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో లోడింగ్ అన్ లోడింగ్ కార్మికులు 184 మందికి రెండు జతల కాకి యూనిఫామ్ జెడి,సి., రామాంజనేయులు ,ఎడిఎం. నారాయణమూర్తి. మార్కెట్ యార్డ్ సెక్రెటరీ ఆర్.జయలక్ష్మి సిఐటియు మార్కెట్ యార్డ్ యూనియన్ అధ్యక్షులు టి .రాముడు. సిఐటియు నగర కార్యదర్శి సిహెచ్ .సాయి బాబా గార్ల సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది సిఐటియు నాయకులు మాట్లాడుతూ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న హమాలి కార్మికులందరికీ పిఎఫ్. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని జాయింట్ డైరెక్టర్ గారిని కోరడం జరిగింది ఆయన స్పందిస్తూ మీ న్యాయమైన డిమాండ్ ను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు మార్కెట్ యార్డులో లైసెన్సు కలిగిన కార్మికులందరికీ రెండు జతల కాకి యూనిఫామ్ ఇస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు మార్కెట్ యార్డ్ యూనియన్ ల నాయకులు బిసన్న, రామకృష్ణ ,కోదండ రాముడు, మధు, నాగరాజు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar