కన్నుల పండుగగా….శ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవం

కన్నుల పండుగగా….శ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవం

●జయ జయ ధ్వనులు మధ్య ముందుకు సాగిన స్వామివారి మహారథం.
●భారీగా తరలివచ్చిన అశేష భక్త జనం.
●భక్త జనసంద్రమైన ఆలయ ప్రాంగణం.
●రథోత్సవానికి గజమాలను సమర్పించిన బిసి కాలనీ యూత్.
హోళగుంద, న్యూస్ వెలుగు:మండల కేంద్రంలో స్థానిక కొండ గుహలో స్వయంభువుగా వెలసిన,భక్తుల ఇలావేల్పుగా పిలవబడే….భక్తుల కోరికలను తీర్చే శ్రీ సిద్దేశ్వర స్వామీ మహా రథోత్సవం శుక్రవారం కన్నుల పండుగగా జరిగింది.ప్రధానంగా ఉదయం నుంచి స్వామి వారి సన్నిధిలో ఆలయ ధర్మకర్త, రాజవంశీయులు హెచ్.రాజపంపన్న గౌడ,సోదరుడు శివశంకర్ గౌడ,తనయుడు సిద్దార్థ గౌడ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి రుద్రాభిషేకం, జలభిషేకం,పంచామృతాభిషేకం,బిల్వార్చన,కుంకుమార్చన, ఆకుపూజ,మహామంగల హారతి వంటి విశేష పూజలు నిర్వహించారు.అలాగే వెండి ఆభరణాలు,పెద్ద ఎత్తున పూలమాలలతో స్వామి వారిని అలంకరించారు.మండలంలోని చుట్టూ పక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అంతేకాకుండా చుట్టూ పక్కల మండలాల ప్రజలు,కర్ణాటక నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు రథోత్సవానికి తరలి రావడంతో శ్రీ సిద్దేశ్వర స్వామి తెరుబజార్ ప్రాంగణం భక్త సంద్రంతో కిక్కిరిసింది.భక్తులు స్వామివారికి దుప దీప నైవ్యద్యాలతో పాటు తమ మొక్కుబడులను సమర్పించారు.సాయంత్రం 7:15నిమిషాలకు గోరవయ్యల వంశస్థుల ఇంటి నుంచి మేటి కుంభంతో రథం వద్దకు చేరుకున్నారు.తదనంతరం వంశపారంపర్యంగా ఆలయ ధర్మకర్త హెచ్.రాజపంపన్న గౌడ,హెచ్.శివశంకర్ గౌడ ఆధ్వర్యంలో రథోత్సవానికి విశేష పూజలు నిర్వహించి,తదనంతరం భక్తులు శ్రీ సిద్దేశ్వర మహా స్వామికి జై…..అనే జయ జయ ధ్వనుల మధ్య తేరు బజార్ ప్రాంగణం మారుమోగింది.మరియు మేళా తాళలు,డప్పు వాయిద్యాలు,గోరవయ్యల నృతోత్సవం,సకల వాయిద్యాల మధ్య రథోత్సవం ఎదురు బసవన్న దేవాలయం వరకు వెళ్లి తిరిగి యథా స్థానానికి చేరుకుంది.అదేవిధంగా ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.మరియు భక్తులతో స్వామివారి ఆలయం కిటకిటలాడింది.అదేవిధంగా సాయంత్రం 3 గంటల నుంచి భక్తులు భారీ పూల హారాలను మెళతాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి రథోత్సవానికి వేశారు.తదనంతరం స్వామివారి సన్నిధిలో అనుకున్న మొక్కుబడులు తీర్చుకున్నారు.రథోత్సవం సందర్భంగా కోలాట నిర్వహించారు.అదేవిధంగా ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 40 మంది పోలీస్ సిబ్బందితో ఎస్ఐ బాల నరసింహులు పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!