సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

గ్రామాభివృద్దే ప్రధాన లక్ష్యం టిడిపి ఇన్చార్జి వీరభద్ర గౌడ్.

బీసీ కాలనీలో ఎన్ఆర్జిఎస్ గ్రాంట్ తో రూ.20 లక్షలతో నిర్మాణం సర్పంచ్ ఆరుభట్ల నాగమ్మ.

హొళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని గేజ్జహళ్లి గ్రామంలోని బీసీ కాలనీ (సౌడు సేను)లో ఉపాధి నిధులతో మంజూరు కాబడిన రూ.20 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం పనులను గురువారం కూటమి నాయకులు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ రంగస్వామి,ఏఈ యమునప్ప,గ్రామ సర్పంచ్ తనయుడు గిరిమల్ల,టిడిపి మండల కార్యదర్శి పూజారి రామలింగ,బి కే పంపపతి,దాసరి రాము,బిజెపి రామలింగ,కాలువ చైర్మన్ పెద్ద ఎర్రిస్వామి,కురువ గాదిలింగ,పింజారి శాసు,జనసేన నాయకులు బ్రహ్మయ్యా,తాయప్ప,అరుణ్ భాష తదితరులు పాల్గొన్నారు.

Was this helpful?

Thanks for your feedback!