
గిరిజమ్మ హౌస్ అరెస్ట్…!
న్యూస్ వెలుగు అనంతపురం : రామగిరి మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి అనంతపురము జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ ని వారి క్యాంపు కార్యాలయంలో హౌస్ అరెస్ట్ చేయడం బాధాకరమని అనంతపురము వైరస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసన సభ సభ్యులు అనంత వెంకట రామి రెడ్డి అన్నారు. దేశంలో ఏపార్టీకి లేని ఓటు బ్యాంకు వైస్సార్సీపీ కి ఉందని కూటమి కుటిల కుతంత్రాలు ఏమి చేయలేవన్నారు. ఈ కార్యక్రమంలో వెన్నపూస రవీంద్రా రెడ్డి , నగర అధ్యక్షులు సోమశేఖర్ సీనియర్ నాయకులు చైర్ పర్సన్ ని పరామర్శించి, సంఘీభావాన్ని తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!