
ఘనంగా జరిగిన బడేరాత్
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో అహలే హదీస్,అహలేసున్నట్,తబిలిక్,రాజా నగర్ దూదేకుల మసీదులలో బడేరాత్ (నాలుగో రాత్రి)లను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు.గురువారం బడే రాత్ సందర్భంగా ముస్లిం సోదరులు,మహిళలు,చిన్నారులు సైతం రాత్రంతా నమాజులు చేసి కురాన్ చదివారు.ఆయా మసీదులలో మౌల్వీలు రంజాన్ మాసం పవిత్రత,కురాన్ గొప్పతనం,దైవ ప్రవక్త సందేశాన్ని చదివి వినిపించారు.ముస్లిం సోదరు లు అధికంగా పేద ప్రజలకు దానధర్మాలు చేసి ఆదుకోవాలని అదే పెద్ద పుణ్యఫలమన్నారు.శాలి మసీద్,రాజా నగర్,తబ్లిక్ మసీదులను మసీద్ కమిటీ నిర్వాహకులు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.బడే రాత్ సందర్భంగా కమిటీ నిర్వాహకుడు స్వీట్లు, పాయాసం,ఫిర్నీలను పంపిణీ చేశారు.సంవత్సరం జరిగే లేక్క పాత్రాలను మసీదులలో చదివారు.అలాగే మౌల్వీలు, మౌజన్ల జీతభత్యాలను,కొత్త దుస్తులను కమిటీ ద్వార అందించి అభినందించారు.ప్రపంచ మానవాళి ఆయురారోగ్యం, వర్షం,ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేశారు.బడే రాత్రులలో మసీదు మౌల్వీలు,మౌజన్ల, సోదరీ,సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అంతేకాకుండా చుట్టూ పక్కల గ్రామాల్లో బడే రాత్ పండుగ ఘనంగా నిర్వహించారు