యువత వారి అడుగుజాడల్లో నడవాలి

యువత వారి అడుగుజాడల్లో నడవాలి

హోళగుంద :దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుదామని పలువురు అధికారులు,ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు.గురువారం మండలంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి.ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చలువాది రంగమ్మ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి తంబాకు నూర్జహాన్ బీ,తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్,పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పెద్దయ్య నాయుడు,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు చైర్మన్ ద్వారక నాథ్ పతాకావిష్కరణ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సేవకు పునరంకితమవుదామని యువతకు పిలుపునిచ్చారు.స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల సేవలను గుర్తు చేసుకున్నారు.మరియు ఎందరో మహనీయుల ప్రాణ త్యాగ ఫలితమే స్వాతంత్ర్యమని చెప్పారు.అలాగే ప్రస్తుతం ఇలా ఎంతో సంతోషంగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నామంటే దేశ సరిహద్దులో సైనికులు రాత్రనక… పగలనక….చలి…వానలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న సైనికులకు వందనం చేశారు. అంతేకాకుండా ఆయా ప్రభుత్వం,ప్రవేటు కార్యాలయాలు,బ్యాంకులు ఇలా…..ఒకటేంటి అన్ని చోట్లా త్రివర్ణ పతాకం రెపరేపలాడింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని అక్షయకు 50 వేల నగదు చెక్కును  అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేజర్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పంచాయితీ సిబ్బందిని సర్పంచ్ చలువాది రంగమ్మ, కార్యదర్శి రాజశేఖర్, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు శాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించారు.అదేవిధంగా చుట్టూ పక్కల గ్రామాలైన వందవాగలి,ఎల్లార్తి,సులువాయి,హెబ్బటం,లింగంపల్లి, మార్లమడికి,గెజ్జెహళ్ళి తదితర గ్రామాల్లో అధికారులు,ప్రధానోపాధ్యాయులు,ప్రజలు అందరూ జాతీయ జెండాను ఆవిష్కరించి సెల్యూట్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుహసినమ్మ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజీర్ అహ్మద్,మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్,వైస్ ఎంపిపి భర్త హనుమప్ప,ఎంపిపి తనయుడు ఈసా,ఎంపీటీసీ తనయుడు శేక్షవలి,ఎంపిటిసి సోదరుడు మల్లయ్య,సర్పంచ్ తనయుడు పంపాపతి,వార్డు సభ్యులు చిన్న మల్లయ్య,ఖాదర్ భాష,వీరేశ్,రవికాంత్,పోలీస్ సిబ్బంది,పంచాయతీ సిబ్బంది,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!