సి.ఐ.ఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి చంద్రబాబు

సి.ఐ.ఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి చంద్రబాబు

విశాఖ (న్యూస్ వెలుగు ): విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) సంయుక్తంగా నిర్వహిస్తున్న 30వ ‘సి.ఐ.ఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2025’ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ‘ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనే సందేశాన్ని ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలని సంకల్పించారు. పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ – ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్-2047 థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని, ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు ఇప్పటికే సింగపూర్, యూఏఈ, యూకే వంటి దేశాల్లో పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తూ సీఎం రోడ్ షోలు, పర్యటనలు నిర్వహించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS