
నూతనపల్లి పాఠశాల పరిసరాలలో మొక్కలు నాటిన ఆర్ యు NSS యూనిట్ 5 వాలంటీర్లు
కర్నూలు, న్యూస్ వెలుగు: నూతనపల్లి గ్రామంలో నేషనల్ సర్వీస్ స్కీమ్ స్పెషల్ క్యాంప్ లో ఐదవ రోజు రాయలసీమ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 5 వాలంటీర్లు పాఠశాల పరిసరాలు శుభ్రపరచి మొక్కలు నాటడం జరిగింది. ఇందులో 25 మంది అమ్మాయిలు 25 మంది అబ్బాయిలు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ బీవీ శివ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో శిబిరంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొని ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లల్ని గ్రామంలో గుర్తించి వారికి పోలియో చుక్కలు వేయించి పోలియో వ్యాధి నుంచి రక్షణ కల్పించారు. నూతనపల్లి గ్రామ సమీప వ్యవసాయ క్షేత్రాలలో రైతుల సమస్యలను ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ప్రోగ్రాం ఆఫీసర్ తెలుసుకొని రైతులకి ఉపయోగపడే సబ్సిడీల గురించి వివరించడం జరిగింది.
Was this helpful?
Thanks for your feedback!

