
కాంగ్రెస్ కమిటీ లోకి యువకులకు ఆహ్వానం
ప్రజా సమస్యల పైన పోరాడాలని అనుకున్న వారికి వారధిగా కాంగ్రెస్ పార్టీ
జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గానికి ఆశావహులు దరఖాస్తు చేసుకొనవచ్చు
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు క్రాంతి నాయుడు బోయ
కర్నూలు, న్యూస్ వెలుగు; జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గమునకు కర్నూలు జిల్లా నందలి ఆశావహులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పత్తికొండ నియోజకవర్గ కోఆర్డినేటర్, న్యాయవాది క్రాంతి నాయుడు బోయ తెలియజేశారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి వెలువడిన పత్రిక ప్రకటనలో క్రాంతి నాయుడు మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సూచన మేరకు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు మార్చి 10 వ తేదీ లోగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యవర్గం ఏర్పాటు కాబోతున్నందున కర్నూలు జిల్లా నందలి ఆశావహులు యువకులు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు, సామాజిక సేవకులు, ఆసక్తిగల ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో చేరి జిల్లా కాంగ్రెస్ కమిటీ మరియు అనుబంధ విభాగాలయిన జిల్లా మహిళా కాంగ్రెస్, డాక్టర్ సెల్, లీగల్ సెల్, కల్చరల్ సెల్, టీచర్స్ సెల్, ఆర్ జి పి ఆర్ ఎస్, డాటా ఎనాలసిస్ డిపార్ట్మెంట్, ఏఐపిసి కమిటీ డిపార్ట్మెంట్, కంట్రోల్ రూమ్, ఎక్స్ సర్వీస్ మెన్ డిపార్ట్మెంట్, గ్రీవెన్స్ సెల్, మీడియా ప్యానలిస్ట్, ఆర్ అండ్ డి, సోషల్ మీడియా, లా అండ్ లీగల్, ట్రైనింగ్ డిపార్ట్మెంట్, అనార్గనైజ్డ్ డిపార్ట్మెంట్ మొదలగు అనుబంద విభాగాలకు దరఖాస్తు చేసుకోవలసిందిగా క్రాంతి నాయుడు తెలిపారు . మీ బయోడేటాలను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేరుగా కానీ 85208 88388 నెంబర్ కు వాట్సప్ ద్వారా కానీ పంపాలన్నారు.


