చీపురుపల్లి నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి

చీపురుపల్లి నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి

విజయనగరం జిల్లా :చీపురుపల్లి నియోజకవర్గంలో  ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు శనివారం పర్యటించారు. చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల వయసు బాలికలకు అందించే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో సీఎం ముచ్చటించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించి పరిశుభ్రతపై ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంటు సభ్యుడు అప్పలనాయుడు, ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళా వెంకట్రావు, కలెక్టర్, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS