ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

డోన్ న్యూస్ వెలుగు :డోన్ లో సైన్స్ దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగింది, స్థానిక కొత్తపేట జడ్పీ పాఠశాల లో శనివారం ఉదయం పాఠశాల ప్రధాన ఉపధ్యాయులు రామ నరసప్ప అధ్యక్షత వహించగా సైన్స్ ఉపాధ్యాయులు చంద్రుడు,లక్ష్మిదేవీ, నాగ లక్ష్మమ్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది, శాస్త్రవేత్త సీ వి రామన్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులకు సైన్స్ శాస్త్రవేత్త సీ వి రామన్ గురించి అవగాహనా కల్పించారు, సైన్స్ గురించి విద్యార్థులచే నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ అందరిని ఆకట్టుకుంది, జర్జీ గా ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు రమేష్ చాలా చక్కగా నిర్వహించడం జరిగింది, జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులను పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానం చేశారు,అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమం సీనియర్ ఉపాధ్యాయుడు శ్రీనివాసులు చక్కగా నిర్వహించారు,ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు పి.లోకనాథ్ రెడ్డి, సుధాకర్,నారాయణ, రజినీకాంత్,సువర్ణమ్మ, పుష్పలత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS