జిల్లా కేంద్రంలో కళాక్షేత్రం ఏర్పాటు చేయాలి
కర్నూలు ( న్యూస్ వెలుగు ) మర్చి 21: ఒకప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు జిల్లా కేంద్రంలో కళాకారులకు ఉపయోగపడే విధంగా కళాక్షేత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు శనివారం సిఆర్ భవన్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి నగర ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏపీ ప్రజానాట్యమండలి ఇన్చార్జి k. జగన్నాథం గారు హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ అర్హులైన కళాకారులందరికి పెన్షన్లు ఇవ్వాలని ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లను నాలుగువేల నుండి 7వేలకు పెంచాలని డిమాండ్ చేశారు అలాగే పేద కళాకారులకి ఆర్టీసీ బస్సులలో రాయితీ ఇవ్వాలని ఆయన కోరారు అలాగే ఏపీ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వి.నాగరాజు మాట్లాడుతూ కర్నూలు నగరంలో పౌరాణికం జానపదాలు రంగస్థల కళాకారులకు కళాక్షేత్రం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు పాత బస్టాండ్ లో ఉన్న ఆడిటోరియాన్ని మున్సిపాలిటీ అధికారులు ఆడిటోరియాన్ని పడగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ కట్టించారు కాబట్టి కళాకారులకు ఆడిటోరియం కట్టించాలని డిమాండ్ చేశారు కలలకు రాయలసీమ పుట్టినిల్లుని ప్రజా సమస్యల పైన కళాకారులు ఈ గడ్డ నుండే గళం విప్పి ప్రజల పక్షాన నిలిచారని ఆయన కొనియాడారు అలాంటి కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో కళాక్షేత్రం లేకపోవడం బాధాకరమన్నారు 1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో కళాక్షేత్రం కోసం శంకుస్థాపన చేయడం జరిగిందని అయితే ఇంతవరకు పాలకుల నిర్లక్ష్యం వల్ల అది కార్యరూపం దాల్చలేదని ఆయన మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి కళాక్షేత్రం ఏర్పాటు కోసం చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా పేద కళాకారులకు పింఛన్ ఇవ్వడంతో పాటు గుర్తింపు కార్డులు మంజూరు చేసి వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చి గృహలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23వ తేదీన కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కళాకారులతో ధర్నా నిర్వహించడం జరుగుతుందని ఈ ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్ర నాయక్ పాల్గొంటున్నారని కావున ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి నగర అధ్యక్షులు శ్రీనివాసులు, డప్పు మాణిక్యం, మల్లికార్జున, మునెమ్మ, చందు, రాజశేఖర్, శేషు తదితరులు పాల్గొన్నారు.

