
రాంపురం కొట్టాలలో భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు
తుగ్గలి (న్యూస్ వెలుగు ) మర్చి 21:తుగ్గలి మండలం పరిధిలోనే రాంపురం కొట్టాలలో శనివారము భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే రాంపురం కొట్టాల నుండి ఈద్గాకు ప్రార్థనలు చేసుకుంటూ ర్యాలీగా వెళ్లారు. ఈద్గాలో రంజాన్ వేడుకల గురించి మత పెద్దలు వివరించారు.ఈ పవిత్ర మాసంలో ఉపవాసం, నమాజ్, దానధర్మాలు పాటించడం ద్వారా ఆధ్యాత్మిక శాంతి పొందవచ్చని వారు తెలిపారు. అల్లాహ్ కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని ప్రార్థించారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు.
రంజాన్ మాసం మనుషుల మధ్య ప్రేమ, దయ, సహనం పెంపొందించే పవిత్ర కాలమని మత పెద్దలు పేర్కొన్నారు. అలాగే తుగ్గలి రాతన జొన్నగిరి చెన్నంపల్లి పగిడిరాయి కడమకుంట్ల హుస్సేనాపురం రామలింగయ్య పల్లె రాంపల్లి తదితర గ్రామాలలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అన్వర్ భాష, (రాతన) షేక్ లడ్డు కమల్ భాష,( రాంపురం) మండల పరిషత్తు కోఆప్షన్ సభ్యులు చాంద్ భాషా, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చెన్నంపల్లి మా భాష, మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యులు నబి రసూల్, సిపిఐ మండల కార్యదర్శి సుల్తాన్, న్యాయవాది పగిడిరాయి బాల్ భాష, వైయస్సార్ సిపి నాయకులు రాంపురం కొట్టాల సయ్యద్ హుస్సేన్ భాష, చెన్నంపల్లి రంజాన్ వలి, సుభాన్, రాతన హోటల్ సయ్యద్ వలి, టిడిపి నాయకులు రాంపురం కొట్టాల ఇస్మాయిల్ భాష ,చెన్నంపల్లి అక్బర్ బాషా, ఆర్ఎస్ పెండేకల్ చాంద్ బాషా, రఫీ, భారత్ కిసాన్ యూనిట్ జిల్లా అధ్యక్షులు బొందిమడుగుల మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పత్తికొండ రూరల్ సీఐ పులి శేఖర్ తుగ్గలి జొన్నగిరి ఎస్ఐలు నరేష్ మల్లికార్జున ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

