
సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిని చేసిన మీనాక్షి నాయుడు
ఆదోని న్యూస్ వెలుగు : సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఆదోని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు అన్నగారి ఆదేశాలు మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్నగారి జరిగింది. ఆదోని నియోజకవర్గానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు 12,63,680 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులు టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్నగారు అందించారు అందజేశారు.ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు అన్నగారు మాట్లాడుతూ..గత 18 నెలల్లో ఆదోని నియోజకవర్గంలో మొత్తం 519 మంది లబ్ధిదారులకు సుమారు రూ.1,85,63,758 కోట్లు సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించబడినట్లు తెలిపారు. ఇక మనకు రావాల్సిన చెక్కులు 267 మందికి రావాలి అని చెప్పారు. ఇంకా మరిన్ని అర్హులైన వారికి సహాయం అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
ఆర్థికంగా బలహీన వర్గాలకు ఆసుపత్రి చికిత్స ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోందని, పేద ప్రజల ప్రాణాలను కాపాడే సంక్షేమ చర్యగా ప్రభుత్వం దీనిని అమలు చేస్తోందని పేర్కొన్నారు.*
ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు, బాధితులు పాల్గొన్నారు.

