ఇంటి స్థలాలు ఇచ్చేంతవరకు పోరాటం చేస్తాం: సీపీఐ

ఇంటి స్థలాలు ఇచ్చేంతవరకు పోరాటం చేస్తాం: సీపీఐ

కర్నూలు (న్యూస్ వెలుగు) : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పేద ప్రజలకు రెండు సెంట్లు స్థలం ఇవ్వాలని అలాగే వారి ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమానికి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ )నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన. జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కే రామాంజనేయులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవుల శేఖర్ గారు ముఖ్య అతిథులుగా హాజరై వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ప్రచార సభలలోభాగంగా సీఎం చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేని చో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలందరినీ ఏకం చేసి కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని మీ ఓటమికి మీరే కారకులు అవుతారని అందులో భాగంగా మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన టిడికో గృహాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అలాగే రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించేంతవరకు పేదలు నివసిస్తున్న బాడుగ ఇండ్లకు ఇంటి అధ్య ప్రభుత్వమే చెల్లించాలని జీవో నెంబర్ 23ని సవరణ చేయాలని పేదల ఇంటికి నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు రుణ సహాయం ప్రభుత్వం అందించాలని ఇప్పటిదాకా పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పారిశ్రామిక వ్యక్తులకు 99 పైసలకే ఎకరం భూమిని కట్ట పెట్టినప్పుడు మీరు అధికారంలో ఉండడానికి కారణమైనటువంటి ప్రజలు నివసించడానికి రెండు సెంట్లు స్థలం ఇవ్వడానికి మీకేం నొప్పి అని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు తక్షణమే పేదలకు ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని నెరవేర్చే దాకా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు ధర్నా అనంతరం

కలెక్టరేట్ ఏవో గారు ధర్నా చేస్తున్న లబ్ధిదారుల దగ్గరికి వచ్చి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వినతిపత్రం తీసుకొని మీ సమస్యలన్నీ త్వరగా పరిష్కారం అయ్యేటట్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని లబ్ధిదారులకు సిపిఐ నాయకులకు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించడం జరిగినది ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ మాణిక్యం నగర సహాయ కార్యదర్శి సి మహేష్ దంభోలం శ్రీనివాసరావు జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు మహిళా సమైక్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గిడ్డమ్మ శ్రావణి నగర కార్యదర్శి భారతి కార్యవర్గ సభ్యులు నాగరాజు అన్వర్ నల్లన్న వెంకటేష్ కిట్టు కుమార్ సి కుమార్ రామచంద్ర అశోకు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమన్న ప్రజానాట్యమండలి నాయకులు మాణిక్యం శీను శాఖ కార్యదర్శులు రామాంజి సులోచనమ్మ రామాంజిగౌడ్ దేవి బాయ్ ప్రసాదు అశోకు యువజన సంఘం నాయకులు నాగరాజు కల్లూరు మండల రైతు సంఘం నాయకులు రాముడు మరియు స్థలాలు లబ్ధిదారులు ఈ ఆందోళన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS