చైన్ స్నాచర్ కేసును చేదించిన పోలీసులు 

చైన్ స్నాచర్ కేసును చేదించిన పోలీసులు 

కర్నూలు న్యూస్ వెలుగు : కర్నూలు నగరంలో మార్చి నెల పదో తారీఖున జరిగిన చైన్ స్నాచింగ్ కేసును కర్నూలు 3టౌన్ పోలీసులు చాకచక్యంగా చేదించినట్లు సిఐ శేషయ్య మీడియాకు వెల్లడించారు. మార్చి 10న 62 సంవత్సరాల వయసుగల శ్యామలమ్మ తన ఇంటి దగ్గర బయట అరుగుపై కూర్చొని ఉండగా గద్వాలకి చెందినటువంటి ప్రవీణ్ అనేటువంటి నిందితుడు ద్విచక్ర వాహనంపై వచ్చి మూడు తులాల బంగారు గొలుసును దొంగలించడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని..,ఈ కేసు ఆధారంగా కేసును చేదించడం జరిగిందని సీఐ శేషయ్య తెలిపారు. ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి గద్వాలకు చెందిన ప్రవీణ్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గతంలో నిందితుడు ప్రవీణ్ నగరంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను నిర్వహించేవాడని అందులో నష్టాలు రావడంతో అప్పులు తీర్చేందుకే ఈ దొంగతనానికి పాల్పడినట్లు ముద్దాయి ప్రవీణ్ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్ కు పంపించనున్నట్లు సీఐ శేషయ్య తెలిపారు.

ఈ కేసులో ఎస్సై బాల నరసింహులు, శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొనట్లు తెలిపారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS