
జయరాజ్ స్టీల్ ప్లాంట్లో భద్రతా చర్యలు ఎక్కడ?
కర్నూలు : ఓర్వకల్లు దగ్గర ఉన్న జయరాజు స్టీల్ ప్లాంట్ నందు అగ్ని ప్రమాదం సంభవించిందని, అదృష్టవశాత్తు మానవ ప్రమాదం ఏమీ జరగలేదని భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. అంజిబాబు ఓర్వకల్లు సిఐటియు మండల కార్యదర్శి శ్రీధర్ కోరారు కార్మిక కర్షక భవన్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రమా దానికి కారణం యాజమాన్యం తెలియజేస్తూ ఉత్పత్తి క్రమంలో ఇటువంటి ప్రమాదాలు జరగడం సహజమేనని తెలిపిందని కానీ అదృష్టవశాత్తు మానవ ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయిందని కానీ కార్మికులు గనక ప్రమాదానికి గురి అయ్యుంటే పెద్ద నష్టం జరిగేదని అన్నారు యాజమాన్యం ఇవి అన్ని ఉత్పత్తి క్రమంలో జరిగే సహజ పరిణామాలని కొట్టిపారేయకుండా భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందని అన్నారు జయరాజ్ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదానికి దగ్గరి గ్రామాలైన గుట్టపాడు, కొంతలపాడు, కొట్టాల గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు గురి అయ్యారని అన్నారు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకవలసి వస్తుందని అటువంటి పరిస్థితులు రాకుండా యాజమాన్యం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై ఫ్యాక్టరీని సందర్శించి పరిశీలించి తగిన చర్యలు చేపట్టే విధంగా సూచనలు చేయవలసిన అవసరం ఉందని డిమాండ్ చేశారు ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులకు భద్రత కల్పించాలని వారు కోరారు సమావేశంలో ఓర్వకల్లు మండల సిఐటియు నాయకులు వెంకటేశ్వర్లు రంగస్వామి సూర్యనారాయణ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు

