ఇంటి పన్ను రద్దుచేయాలి

ఇంటి పన్ను రద్దుచేయాలి

కర్నూలు న్యూస్ వెలుగు : ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇందిరమ్మ,బీడీ వర్కర్స్ కాలనీలా ఇండ్లకు పన్ను రద్దు చేయాలి.సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి విజయరామాంజనేయులు డిమాండ్ చేశారు.

సిఐటియు ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం పేదలకు కార్మికులకు ఇచ్చిన ఇండ్లకు పన్నులు రద్దు చేయాలని కోరుతూ సిఐటియు నగర ఉపాధ్యక్షులు మైముద్ అధ్యక్షతన ఇందిరమ్మ కాలనీ లోని 45వ.సచివాలయం ముందు ధర్నా చేసి అడ్మిన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు సిఐటియు నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్, సిఐటియు నగర ఆఫీస్ బేరర్స్ కుమార్, నాగరాజు, అఫ్రోజ్ మౌలానా పాల్గొని మాట్లాడుతూ 2005లో యూపీఏ వన్ గవర్నమెంట్ ఎం.ఏ. గఫూర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇండ్లు లేని నిరుపేదకార్మికుల కోసం కాలనీ ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు, అప్పుడు రెవిన్యూ అధికారులు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు మున్సిపల్ అధికారులు అందరు కలిసి కాలనీ అభివృద్ధి కోసం మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించి రోడ్లు కరెంటు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయబడిందని అన్నారు, ఆ తర్వాత ఎన్నికైన ఏ ఒక్క ఎమ్మెల్యే గారైన అక్కడ ఉన్న పేదల అభివృద్ధి కోసం నిధులు కేటాయించి అభివృద్ధి చేయలేదని విమర్శించారు, ఇందిరమ్మ,బీడీ వర్కర్స్ కాలనీలో మెయిన్ రోడ్డు మినహాయిస్తే ఎక్కడ కూడా రోడ్లు, మురుగు కాలువలు మంచినీటి పైపులైను అభివృద్ధి చేయలేదని స్థలం కేటాయించిన పార్కులను అభివృద్ధి చేయకపోగా వాటిలోనికి కొంత మంది దొంగలను పురమాయించి రెవెన్యూ అధికారులు ఫేక్ పట్టాలు ఇచ్చారని వాటికి జీనియన్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చారని బహిరంగ ప్రచారమే జరుగుతుందన్నారు, లేఅవుట్ లో ఉన్న ప్రకారం కాకుండా కాలనీ అస్తవ్యస్తంగా మారిందని దీనికి రాజకీయ నాయకులు రెవెన్యూ అధికారులు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు, ప్రభుత్వమే ఇచ్చిన స్థలాలలో ఇండ్లు నిర్మించుకున్న పేద కార్మికుల పైన ప్రభుత్వ ఒత్తిడితో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వారు ప్రతి సంవత్సరం 40 నుండి 50 లక్షలు దాక వసూలు చేసి ఇందిరమ్మ, బీడీ వర్కర్స్ కాలనీలో పిడికెడు మన్నువేసిన పాపానలేదని, సక్రమంగా మంచినీళ్లు అందజేసిన పుణ్యంగాని లేదని గుర్తు చేశారు, కర్నూలు నగరమంతా మున్సిపల్ కమిషనర్ గారు శానిటేషన్ పైన గాని నగర అభివృద్ధి పైన గానీ పార్కుల అభివృద్ధి పైన గానీ మాట్లాడే దాని కంటే రోజు ఏ సచివాలయ ఉద్యోగస్తులు ఎంత పన్ను వసూలు చేస్తున్నారని సక్రమంగా చేయకపోతే సోకాజు నోటీసులు ఇస్తామని సచివాలయ ఉద్యోగస్తులను వేధిస్తున్నారని బాధ వ్యక్తం చేశారు, నిజంగా ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నుల సొమ్మును ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు పెడితే ఈరోజుకు కర్నూలు నగరం అభివృద్ధిలో ముందుకు పోయేదని ఆ పని కాకుండా వసూలైన డబ్బులు ప్రభుత్వానికి పంపడం ద్వారా నగర అభివృద్ధి కుంటుపడుతుందని విమర్శించారు, కాబట్టి ఇప్పటికైనా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు కర్నూలు నగర ప్రజల పైన జోహరాపురం ఇందిరమ్మ కాలనీ బీడీ వర్కర్స్ కాలనీ ప్రజల పైన దయవుంచి పన్నుల బస్సులు ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు లేని పక్షాన ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బడే భాష షఫీ ముత్తు భరత్ మరియు కాలనీవాసులు కార్మికులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS