
తాగునీటి సమస్య పరిష్కరించాలి
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం ఈరోజు గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు బృందంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ రైతు లు సోమన్న వెంకటేశ్వర్లు రంగస్వామి శ్రీధర్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడుతూ గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేయడంలో ప్రభుత్వం అలసత్వం చూపిస్తున్నదని గత పది సంవత్సరాలుగా పాలకులు గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేసి కర్నూలు జిల్లాకు సాగు తాగునీటి తోపాటు కేసీ కెనాల్ కు నిరంతరాయంగా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలియజేశారు ఇంతటి బృహత్తరమైనటువంటి రిజర్వాయర్ను నిర్మాణం చేయడానికి అవసరమైన నిధులు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాక అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం ప్రజలను, రైతులకు మాయ మాటలు చెప్పి మోసగించడం తప్ప ప్రాజెక్టు పురోగతి ఏమాత్రం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నేటి కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ప్రాజెక్టులు ఎలా నిర్మాణం చేస్తారని ఆయన ప్రశ్నించారు నిత్యం కరువుకు గురవుతున్నటువంటి కర్నూలు జిల్లాను ప్రాజెక్టులు నిర్మాణం చేయడం ద్వారానే ససశ్యామలం చేయడానికి అవకాశం ఉందని అటువంటి ప్రాజెక్టులను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఇప్పటికైనా గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించి నిర్మాణం చేస్తే 20 టీఎంసీల నీళ్లు నిలువ ఉండడానికి అవకాశం ఉందని నీటిపారుదల నిపుణులు ప్రభుత్వాలు దృష్టికి అనేక మార్లు నివేదికల రూపంలో తెచ్చారని అయినా అవి కాగితపు బుట్టలోకి పోతున్నాయి తప్ప ఆచరణ రూపం దాల్చి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడంలో ఏమాత్రం ఉపయోగం లేకుండా పోతున్నాయని ఇప్పటికైనా గుండ్రేవుల రిజర్వాయర్ను నిర్మాణం చేయడం కోసం అవసరమైన నిధులు కేటాయించి నిర్మాణం చేయాలని వారు డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గుండ్రేవుల రిజర్వాయర్ ఆర్డీఎస్ కుడి కాలువ మేలుగనూరు వరద కాలువ వేదవతి తదితర ప్రాజెక్టుల నిర్మాణం కోసం పోరాట కమిటీగా ఏర్పడి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు.

