రోడ్లు,కాలువలు నిర్మించండి: సీపీఎం

రోడ్లు,కాలువలు నిర్మించండి: సీపీఎం

కర్నూలు న్యూస్ వెలుగు : శ్రీరామ నగర్ లక్ష్మీ నగర్ల లాస్ట్ లైన్ లో డ్రైనేజీ కాల్వ రోడ్లు నిర్మించాలని కోరుతూ శ్రీరామ్ నగర్ లోని 58 59 సచివాలయాల వద్ద 23వ వార్డు సిపిఎం పార్టీ వార్డు కమిటీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి Cశ్రీనివాసులు అధ్యక్షత వహించారు. డ్రైనేజీ కాలువలు రోడ్లు నిర్మించడంలో సచివాలయ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి రాజకీయ నాయకులు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు C.గురు శేఖర్ సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు సిపిఎం పార్టీ నగర నాయకులు శ శేషాద్రి  ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీరామ నగర్ లక్ష్మీ నగర్ లకు చివరి లైన్ లో డ్రైనేజీ కాలువ నిర్మించి రోడ్లు వేయాలని గత చాలా కాలంగా అనేకమార్లు అర్జీలు ఇచ్చిన డ్రైనేజీ కాలువ రోడ్లు వేయకపోవడం చాలా దుర్మార్గం అన్నారు డ్రైనేజీ కాలువలు రోడ్లు నిర్మించడంలో పని చేయలేని సచివాలయ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీ కాలువలు లేకపోవడం వలన వర్షం వచ్చిన ప్రతిసారి మోకాల్లోతు నీళ్లు నిలిచిపోయి మురికి కోపం లా మారిపోయి పందులు దోమలకు నిలయాలుగా కాలనీ ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు మురుగునీరు నిలిచిపోయిన రాకపోకలు చిన్నపిల్లలు ముసలివారు మురుగునీటిలో నడవలేక జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారు డెంగ్యూ మలేరియా వంటి జరాల బారిన పడి ఒకరు మరణించారు పదుల సంఖ్యలో అనారోగ్యానికి గురి కావడం జరిగింది అన్నారు ఓట్ల సందర్భంగా వీధిలో తిరిగి వంగి వంగి దండాలు పెట్టి ఓట్లు వేయించుకొని ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం చాలా దుర్మార్గం అన్నారు కాలనీ ప్రజల చేత ఇంటి పన్నులు కొళాయి పన్నులు కట్టడము లేట్ అయితే క్రమం తప్పకుండా వడ్డీ రెండు రూపాయలు వేసి పన్నులు కట్టించుకుని ప్రతి సంవత్సరము 15% ఇంటి పన్ను పెంచి ప్రజల పైన మోయలేని భారం వేస్తున్నారు మున్సిపల్ అధికారులు రాజకీయ నాయకులు ప్రజలను నిలువు దోపిడి చేస్తున్నారు అని దుయ్యబట్టారు ప్రజలకువసతులు కల్పించడంలో ప్రజా ప్రతినిధులు మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలం చెందారని అన్నారు. డ్రైనేజీ కాలువలు రోడ్లు నిర్మించాలని అనేకమార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఇదిగో వేస్తాం అదిగో వేస్తామని చెబుతూ కాలయాపన చేస్తూ కాలనీ ప్రజలను మోసం చేయడము మంచిది కాదని ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే డ్రైనేజీ కాలువ రోడ్లు నిర్మించి ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా చేయాలని ఆ విధంగా చేయకపోతే సచివాలయ అధికారులు పనిచేయకుండా ప్రజలను సమీకరించి స్తంభింప చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎల్లయ్య రమేష్ లక్ష్మన్న మధు వెంకటరమణ శేఖర్ జాన్సన్ చందు కర్రెన్న ఉమా లక్ష్మీదేవి మొదలగు వారు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS