బ్లాక్ మార్కెట్ ను అరికట్టేది ఎప్పుడు..? సీపీఎం

బ్లాక్ మార్కెట్ ను అరికట్టేది ఎప్పుడు..? సీపీఎం

కర్నూలు న్యూస్ వెలుగు : కర్నూల్ నగరంలో గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ బుక్ చేసుకున్న కస్టమర్లకు సరైనసమయానికి గ్యాస్ సిలిండర్ ఇవ్వకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని పూల బజార్ సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అబ్దుల్ దేశాయి అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని నగర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నగర ప్రధాన కార్యదర్శి ఎం రాజశేఖర్, సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.విజయ్, కే.రామకృష్ణ మాట్లాడుతూ అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడిందని ఈ మధ్యకాలంలో ఇంటికి వాడుకునే గ్యాస్ సిలిండర్ పై 66 రూపాయలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై 105 రూపాయలు పెంచడం జరిగిందని అయినా ప్రజలు భరిస్తున్నారని, గ్యాస్ బుక్ చేసుకున్న కష్టమర్లకు ఫోన్ చేసి మీకు ఓటిపి నంబర్ వస్తుంది చెప్పండి అని ఓటిపి నెంబర్ చెప్పించుకున్న తర్వాత ఆ సిలిండర్ను కస్టమర్కు ఇవ్వకుండా హోటళ్లకు, చిరు వ్యాపారులకు బ్లాక్ లో2000 నుండి 2,500 వరకు అమ్ముకోవడం జరుగుతుందని గ్యాస్ డెలివరీ బాయిస్, గ్యాస్ ఏజెన్సీల లీలలు అంతా ఇంతా కాదని మండిపడ్డారు. ఒకవైపు నిత్యవసర వస్తువులు పెరగడం మరోవైపు గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ సరైన సమయానికి అందకపోవడం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమేనని విమర్శించారు.  ప్రధాని నరేంద్ర మోడీ రష్యా నుండి ముడి చమురు రూపాయలలో కొని రిలయన్స్ కు కట్టబెడుతున్నాడని ఈ దేశ ప్రజల కన్నా కార్పొరేట్ శక్తులైన ఆదానీ, అంబానీలే ఎక్కువయ్యారని ప్రజలకేమో కష్టాలు ఆధాని ,అంబానీలకు సబ్సిడీలు ఇవ్వడం ఇది చాలా దుర్మార్గమని విమర్శించారు. అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల గ్యాస్ సరఫరా లో మనకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇరాన్ నుండి వచ్చే గ్యాస్ కార్గో షిప్పులకు మన జెండా ఉంటే ఫ్రీగా వదిలే పరిస్థితి ఉందని అన్ని పత్రికలలో ప్రముఖంగా వస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టించి గ్యాస్ వాడే కస్టమర్లను ఇబ్బందికి గురి చేయడం సరైన పద్ధతి కాదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. గ్యాస్ డెలివరీ బాయ్ లు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఓటీపీల పేరుతో కస్టమర్లను మోసగించి గ్యాస్ సిలిండర్లను బ్లాక్ లో అమ్ముకోవడాన్ని తక్షణమే నివారించాలని, గ్యాస్ బుక్ చేసుకున్న కస్టమర్లకు సరైన సమయానికి గ్యాస్ సిలిండర్లను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు చాంద్ ఇస్మాయిల్ గిడ్డయ్య ప్రకాష్ వెంకటేశ్వర్లు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS