
ప్రభుత్వానికి పట్టని అంగన్వాడీల సమస్యలు
కర్నూలు న్యూస్ వెలుగు :పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచి కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి.అంజిబాబు నగర కార్యదర్శి మహమ్మద్ రఫీ డిమాండ్ చేశారు కర్నూల్ అర్బన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు కృష్ణవేణి అధ్యక్షతన అర్బన్ ప్రాజెక్టు ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు గత ఏడు సంవత్సరాలుగా జీతాలు పెరగలేదని ఏడు సంవత్సరాల కాలంలో నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో 42 రోజులు సమ్మె చేసిన అంగన్వాడీల ఆందోళనకు మద్దతిస్తూ టిడిపి నాయకులు తాము అధికారం లేక వస్తే అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని తెలిపారని కానీ రెండు సంవత్సరాలు కావస్తున్న అంగన్వాడీలకు జీతాలు పెంచే విషయం మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు అంగన్వాడీలు తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతూ పనిచేస్తున్నారని కానీ వారి సమస్యలు మాత్రం ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు అంగన్వాడీలకు మే నెలలో వేసవి సెలవులు ఇవ్వాలని కోరారు పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్న ప్రభుత్వం అంగన్వాడి బడి లకు సెలవులు ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు గతంలో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని విమర్శించారు గ్రాడ్యుటీకి సంబంధించిన గైడ్లైన్స్ రూపొందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు అంగన్వాడి సమస్యల పరిష్కారం కోసం విడతల వారి ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బాలదుర్గమ్మ ప్రాజెక్టు నాయకులు మహేశ్వరి సువర్ణ దానమ్మ జయలక్ష్మి రమా తదితరులు పాల్గొన్నారు అనంతరం సిడిపిఓ గారికి వినతిపత్రం అందజేశారు

