
తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి: సీపీఎం
తుగ్గలి న్యూస్ వెలుగు :తుగ్గలి మండలంలో గత ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలు నేపథ్యంలో భారీగా నష్టపోయిన తుగ్గలి మండల రైతాంగాన్ని ఆదుకునేందుకు మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలని సిపిఎం మండల కార్యదర్శి జి ,శ్రీరాములు డిమాండ్ చేశారు. గురువారం నాడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కు తుగ్గలి మండలంను కరువు మండలం గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి జి, శ్రీరాములు మాట్లాడుతూ, గత వ్యవసాయ సీజన్ లో ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ నందు ఆగస్టు మాసం నుండి అక్టోబర్ నెల వరకు అతివృష్టి నేపథ్యంలో ఖరీఫ్ సీజన్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు ఎకరాకు 8 నుండి 10 కింటాలు రావలసిన పత్తి మూడు నాలుగు క్వింటాలకే పరిమితమైందని అదేవిధంగా ఇతర వాణిజ్య పంటలు, వేరుశనగ, కంది ,ఆముదము జొన్న, మొక్కజొన్న వంటి పంటల దిగుబడి భారీగా పడిపోయిందని పెట్టుబడులు మాత్రం వేలకు వేలు పెట్టి దిగుబడి లేక రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కావున ప్రభుత్వం స్పందించి మండలాన్ని కరువు మండలం గా ప్రకటించి రైతుకు పంట నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. హంద్రీనీవా కాలువకు నుండి సాగునీరు వస్తున్న పంట కాలువలు లేని నేపథ్యంలో రైతులందరికీ సాగునీరు రావడంలేదని ఇది ప్రభుత్వం గమనించాలని ఆయన కోరారు. వాస్తవ పరిస్థితుల్లో గమనించి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం తుగ్గలి శాఖ కార్యదర్శి బన్నీ, సుంకన్న, లాలప్ప, రామాంజనేయులు, హనుమంతు, బీరప్ప, రంగన్న,తదితరులు పాల్గొన్నారు.

