
మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్
కర్నూలు న్యూస్ వెలుగు :కర్నూలు ఠాగూర్ నగర్ లోని డోన్ రహదారిలో నూతనంగా ఆధునిక సౌకర్యాలతో నెలకొల్పిన జయ రామ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ మాజీ ఎమ్మెల్యేలు శిల్ప చక్రపాణి రెడ్డి, శిల్ప రవి కిషోర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ఆసుపత్రి ఎండి డాక్టర్ కే చంద్రమౌళీ రెడ్డితో కలిసి ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యరంగంలో కర్నూలు ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. కర్నూలు ఎంతో పేరున్న ప్రాంతమని, రాష్ట్ర అభివృద్ధిలో కర్నూలు సేవలు ఎనలేనివని కొనియాడారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల పేద ప్రజలకు ఎన్నో ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో జయరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను స్వయాన ఫిజీషియన్ అయినా డాక్టర్ కె చంద్రమౌళి రెడ్డి ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఏ జబ్బు వచ్చినా మొదటగా వెళ్ళేది ఫిజీషియన్ దగ్గరికెనన్నారు. ఫిజీషియన్ల వద్ద ఆరోగ్య సలహాలు తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఆస్పత్రి ఎండి డాక్టర్ కే చంద్రమౌళి రెడ్డి మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కే శివ శంకర్ రెడ్డి, డాక్టర్ కె అరవింద లు పాల్గొన్నారు.


