ఎమ్మెల్యే కే.ఈ.శ్యాం కుమార్
తుగ్గలి, న్యూస్ వెలుగు ; తుగ్గలి మండలం పరిధిలోని చెరువు తాండాలో రూ.26.50 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కే.ఈ.శ్యాం కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం టిడిపి మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే.ఈ.శ్యామ్ కుమార్ మాట్లాడుతూ గిరిజన తండాల అభివృద్ధికి

కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తండాలలో రహదారులు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, డ్రైనేజ్ వంటి మౌలిక వసతులను మెరుగుపరచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్ పి.వెంకటపతి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గిరిజన తండాలలో అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందిన ఘనత టిడిపిదేనని ఆయన తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రతి తండాను అభివృద్ధి దిశగా ఎమ్మెల్యే కే.ఈ.శ్యాం కుమార్ సహకారంతోనే ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గిరిజన తండాలలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఎమ్మెల్యే కే.ఈ.శ్యామ్ కుమార్ సమక్షంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ వార్డ్ మెంబర్ దేవి బాయ్, వై.ఎస్.ఆర్.సి.పి నాయకులు జయరామ్ నాయక్ దంపతులు టిడిపిలోకి చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కె.ఈ.శ్యామ్ కుమార్ తండాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై తాము టిడిపిలో చేరినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఏఈ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి దేవేంద్ర, మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకట రాముడు, మారెళ్ళ సింగిల్ విండో అధ్యక్షులు అప్పా వేణు, మైని కార్పొరేషన్ మాజీ రాష్ట్ర డైరెక్టర్ తిమ్మయ్య చౌదరి, టిడిపి నాయకులు బీసీ వెంకటస్వామి, చంద్రశేఖర్ యాదవ్, మిద్దె వెంకటేష్ యాదవ్, టిడిపి ఉపాధ్యక్షుడు వెంకట్రామ చౌదరి, మిద్దె రవికుమార్ యాదవ్, ఎద్దులదొడ్డి శ్రీనివాసులు గౌడు, గిరిగేట్ల సత్య ప్రకాష్, మాజీ వైస్ ఎంపీపీ కొమ్ము వెంకటేష్, ఉప్పర్లపల్లె మనోహర్, స్థానిక టిడిపి నాయకులు చెరువు తండా రాము నాయక్, లక్ష్మీ తండా డి. హనుమంత్ నాయక్, మిద్దె తాండ ఎం సోము నాయక్, మీటు నాయక్, ఎర్రగుడి గోవిందు, వెంకట్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!