చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బీజేపీ కృషి  చేయాలి 

చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బీజేపీ కృషి  చేయాలి 

పత్తికొండ, న్యూస్ వెలుగు;  పత్తికొండ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పత్తికొండ మండల బిజెపి అధ్యక్షులు కరణం నరేష్ అధ్యక్షతన పత్తికొండ మహిళ మోర్చా నాయకురాళ్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి మహిళా మోర్చా నాయకురాలు రామాంజినమ్మ మాట్లాడుతూ దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టంగా అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయం అని కొనియాడారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక గొప్ప మైలురాయి అని పేర్కొన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి దృఢ సంకల్పంతోనే ఈ బిల్లుకు కేంద్రంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్టీలు అన్నీ కూడా ముక్తకంఠంతో ఆమోదం తెలిపేందుకు సిద్ధమైన శుభ తరుణంలో దేశం నవభారత్ నిర్మాణంలో ముందడుగు వేయాలంటే మహిళలు అత్యంత శక్తిసామర్థ్యాలు కలవారని గుర్తించడం శుభ సూచకం అని అన్నారు. ఇది మహిళా మణులందరికీ తొలి అడుగని, చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం ద్వారా మహిళల రాజకీయ ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుందని, నిర్ణయాధికారంలో మహిళల భాగస్వామ్యం బలపడుతుందని, ‘నవ భారత నిర్మాణం’ దిశగా ఇది కీలక అడుగు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గోవర్ధన్ నాయుడు, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బ్రహ్మయ్య, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, బిజెపి మహిళా మోర్చా నాయకురాల్లు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS