మంత్రి సత్య కుమార్ యాదవ్
వినికిడి లోపం ఉన్న వారికి అత్యాధునిక పరికరాలతో ఉన్నత వైద్యo
జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో బెరా, ఇంపిడెన్స్, ప్యూర్ టోన్, ఆడియో మెట్రీ పరికరాల సిద్ధం
సౌండ్ ప్రూప్ రూములు కూడా..
సులువుగా వైకల్య నిర్ధారణ పరీక్షలు
-మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ కి నివేదించిన డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులు
అమరావతి, న్యూస్ వెలుగు;
వినికిడి లోపం కలిగిన వారికి అత్యంత ఉన్నత వైద్యాన్ని కూటమి ప్రభుత్వం చేరువ చేస్తోంది. బెరా (brainstem evoked response audio metry -బ్రెయిన్ స్టెమ్ ఏవోక్డ్ రెస్పాన్స్ ఆడియో మెట్రీ), ఇంపిడెన్స్ (impedance) ఆడియో మెట్రీ, ప్యూర్ టోన్ (pure tone) ఆడియో మెట్రీ పరికరాలను అవసరమైన జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో సమకూరుస్తోంది.

వినికిడి లోపం కలిగిన వారికి ఉన్నత వైద్యాన్ని అందించాలంటే ఈ మూడు రకాల పరికరాలు ఉండాలి. అయితే కొన్ని అసుపత్రుల్లో ఒకటి ఉంటే మరొకటి లేదు. మరికొన్నిచోట్ల అసలు లేవు. దీనివల్ల వినికిడి లోపం కలిగిన వారు ఉన్నత వైద్యం కోసం బోధనాసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలోని పరిస్థితులపై అధ్యయనం చేసి, రోగుల అవసరాల మేరకు పరికరాలను ఆసుపత్రుల్లో సమకూర్చేందుకు ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే సుమారు రూ.20 కోట్లతో బెరా, ఇంపిడెన్స్, ప్యూరోటోన్ ఆడియో మెట్రీ పరికరాలను స్థానిక అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రుల్లో సమకూరుస్తున్నారు అలాగే ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో సౌండ్ ప్రూఫ్ రూములను సైతం సిద్ధం చేస్తున్నారు. రోగులకు ఆసుపత్రుల్లో వీటిని అందుబాటులోనికి తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యలపై డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులు మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ కు నివేదించారు. వీటిని ఆసుపత్రుల్లో అందుబాటులోనికి తెచ్చే పనులు 80% వరకు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని మరో నెలలోగా సిద్ధంచేస్తామని వారు మంత్రికి వివరించారు. సదరం కింద జరిగే వైకల్య నిర్ధారణ పరీక్షలకు ఈ పరికరాలు బాగా ఉపయోగపడనున్నాయి. బాధితుల వినికిడి లోపాన్ని సూక్ష్మస్థాయిలో గుర్తించి సర్టిఫికెట్లు జారీ చేసేందుకు వీలవుతుంది
8 ఆసుపత్రుల్లో తొలిసారిగా మూడు పరికరాలు సిద్ధం!
తెనాలి జిల్లా ఆసుపత్రి, నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా), పాలకొండ (మన్యం), డోన్ (నంద్యాల), కందుకూరు
Thanks for your feedback!