
తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల కార్పొరేషన్ చైర్మన్ ను సన్మానించిన కర్నూలు జిల్లా కురువ సంఘం
తెలంగాణ ( న్యూస్ వెలుగు ): తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి సరితమ్మ తిరుపతయ్య ను సన్మానించిన కర్నూలు జిల్లా కురువ సంఘం.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్వాలకు చేందిన కురువ సరితమ్మ తిరుపతయ్య కు గొర్రెల మేకల కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ఉదయం గద్వాల ఆమె నివాసంలో కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కే రంగస్వామి పాలసుంకన్న ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ బిల్డర్ వెంకటేశ్వర్లు కోశాధికారి కె సి నాగన్న పట్టణ అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు తిరుపాల్ తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించారు.
Was this helpful?
Thanks for your feedback!

