FlatNews Buy Now
హంద్రీ నదికి వెంటనే హంద్రీ నీవా నీటిని  విడుదల చేయాలి

హంద్రీ నదికి వెంటనే హంద్రీ నీవా నీటిని విడుదల చేయాలి

కర్నూల్ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి  తీసుకెళ్లిన పాణ్యం నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి  గౌరు చరితా రెడ్డి గారి సూచన మేరకు ఆదేశాలు

కల్లూరు, న్యూస్ వెలుగు :  హంద్రీ నది లో ఏర్పడుతున్న నీటి ఎద్దడి కి హంద్రీ నీవా ఆధారిత గ్రామాలు పడుతున్న తాగునీటి సమస్య లను   హంద్రీ నీవా నీటిని   విడుదల చేయాలని  సోమవారం  pgrs  కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి  గౌరు చరితా రెడ్డి  సూచన మేరకు కర్నూల్ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన తెలుగుదేశం పార్టీ  కల్లూరు మండల అధ్యక్షులు శ్రీ డి.రామాంజనేయులు aputf  గారు, బొల్లవరం గ్రామ తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు బీవీజీ. మస్తాన్ నాయుడు గారు,పూసులూరు, రేమడూరు, బస్తీపాడు, చిన్నటేకూరు  మరియు హంద్రీ ఆధారిత గ్రామ ప్రజలు కలెక్టర్ కు తెలిపారు.   కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఇరిగేషన్ s.c గారిని పిలిపించి తక్షణమే ఈ సమస్యని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కలెక్టర్ గారు..మరి ఒక రోజులో బొల్లవరం గ్రామ హంద్రీ కి నీరు వచ్చేలా అదే విదంగా తదుపరి గ్రామాలకు కూడా నీటి ఎద్దడి తీవ్రతను తగించేలా చర్యలు  తీసుకోవాలన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS