
ఆక్రమణ దారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి: ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ రామకొండ వెంకటేశ్వర్లు
కర్నూలు జిల్లా పత్తికొండ మండల కేంద్రంలో మొలకళకుంట ను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించడం జరిగిందని ఎమ్మార్పీఎస్ నాయకులు పత్తికొండ ఆర్డిఓ ఓబులేష్ కి వినతి పత్రాన్ని అందించినట్లు వెల్లడించారు. గతంలో అదే స్థలాన్ని దళితులకు ఇచ్చినట్లు MRPS రాష్ట్ర కో కన్వీనర్ రామకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. 2014 లో 200 మంది నిరుపేదలకు ఇల్ల పట్టాలు ఇవ్వాలని అప్పటి డిప్యుటీ సీఎం కెఈ కృష్ణమూర్తికి వినతిపత్రం ఇచ్చినట్లు వెల్లడించారు. కొంతమంది ఆక్రమణ దారులు ప్రభుత్వ భూలను ఆక్రమించి సొమ్ము చేసుకునేలా వ్యవహారిస్తున్నారని దానికి అధికారులు కూడా తంతు పాడుతున్నట్లు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు. పత్తికొండ గ్రామ రెవిన్యూ కి సమందించిన 203 సర్వే నెంబర్ లోని మొత్తం మూడు డివిజన్ లు ఉన్నట్లు రికార్డులు చెబుతుంటే కొంతమంది మాత్రం భూమిని ఆక్రమించుకుని కోట్లు విలువ చేసే ఆస్తులను కోళ్లగొట్టడం జరుగుతుందన్నారు. ఆ భూములు మావే అని జేసీబీ లు పెట్టి చదును చేసి వెంచర్లు వేస్తున్నట్లు ఆర్డివో కి తెలిపారు. దీనిపై పూర్తి విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ని కోరగా.. ఆయన స్పందిస్తూ దానిపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పి జిల్లా అధ్యక్షులు సుభాష్ చంద్ర, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ రామకొండ వెంకటేశ్వర్లు, నరసింహులు, జిల్లా ఉపాధ్యక్షులు రాముడు, జిల్లా నాయకులు రామాంజినేయులు, ఉచ్చురప్ప, నరసన్న ఈరన్న తదితరులు పాల్గొన్నారు.


