ఏపీ ఏ ఐ ఎం ఎస్ యాప్ ద్వారా నే యూరియా పంపిణీ :- ఏవో శేషాద్రి

ఏపీ ఏ ఐ ఎం ఎస్ యాప్ ద్వారా నే యూరియా పంపిణీ :- ఏవో శేషాద్రి

కౌతాళం జూన్ 9 న్యూస్ వెలుగు :- కౌతాళం మండలంలోని రైతులకు రాబోయే ఖరీఫ్ సీజన్ నందు ఎరువుల పంపిణీ విధానంలో ఏ పి ఏ ఐ ఎం ఎస్ యాప్ ద్వారా ఎరువుల డీలర్లు రైతులకు పంపిణీ చేయు విధానం రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదో తేదీ నుంచి మొదలు పెట్టడం జరిగింది, ఈ విధానంలో ప్రతి రైతుకు ఎన్ని ఎకరాలు పొలం ఉన్నదో దాని బట్టి పంటకు ఇచ్చిన రికమండేషన్ ప్రకారము పత్తి, మిరప,వరి మరియు ఇతర పంటలకు పంటలకు రేఖమెండేషన్స్ ప్రకారము యాప్ నందు మొదటి విడత, రెండో విడత, మూడో విడత ప్రకారము యాప్ నందు పొందుపరిచిన విధంగా. రైతులకు కావాల్సిన ఎరువులు వారి ఆధార్ కార్డు తీసుకుని ఎరువుల డీలర్లకు చూపించి యాప్ నందు సూచించిన మోతాదులో యూరియా మరియు డిఏపి విడతలవారీగా రైతులు తీసుకొన వలసిందిగా తెలియజేయడమైనది. ప్రతి వీడతకు 20 రోజుల వ్యవధిలో పంపిణీ చేయడం జరుగుతుంది, కావున మన మండలంలోని ఎరువుల డీలర్ దగ్గర యూరియా ఉన్నచో అక్కడ మండలంలోని రైతులు ఎవరైనా గాని వెళ్లి మీ యొక్క ఆధార్ను సమర్పించి ఎరువులు పొందగలరని రైతాంగానికి తెలియజేయడమైనది. హాల్వి గ్రామం నందువీరభద్రేశ్వర ఫర్టిలైజర్ లో విరుపాక్షి  రెడ్డి ,అనే చూడి రైతుకు మొదటి విడతలోని మూడు బస్తాల యూరియాని పంపిణీ చేయడం జరిగిందని అగ్రికల్చర్ అధికారులు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS