
బాలయ్య జన్మదినానికి హాజరైన మంత్రాలయం సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి
మండల అధ్యక్షుడు సురేష్ నాయుడు
కౌతాళం, న్యూస్ వెలుగు : 09 జూన్ :హిందూపూర్ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను కౌతాళం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరంలో గౌరవ ముఖ్య అతిథిగా మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి గారి సోదరులు మంత్రాలయం సింగిల్ విండో చైర్మన్ ఎన్.రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి అభిమానులు, పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు.ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారిని ప్రశంసాపత్రాలు, అందజేసి వారిని సత్కరించారు అభినందించిన ఎన్.రామకృష్ణ రెడ్డి
సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, ఒకరి రక్తం మరొకరి ప్రాణాలను కాపాడగలదని అన్నారు.యువత సేవా కార్యక్రమాల్లో ముందుండి సమాజానికి ఆదర్శంగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఎంతో సంతోషకరమని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండలం అధ్యక్షులు, ముఖ్య నాయకులు, బాలకృష్ణ అభిమానులు, యువకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

