FlatNews Buy Now

ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించేదెవరు ..?

పత్తికొండ (న్యూస్ వెలుగు ): దున్నపోతుపై వర్షం కురిసినట్టుంది అధికారుల పనితీరు. సిటీ నడిబొడ్డున హైవేకి అనుకుని కోట్లు విలువ చేసే భూమిని అర్ధరాత్రి అప్పనంగా కొట్టేయాలని గుట్టు చప్పుడు కాకుండా  … రాత్రికి రాత్రి జేసీబీలతో చదును చేసి … వెంచర్ వేసి అమాయక ప్రజలకు కుచ్చు టోపీ పెట్టాలని చూసిన ఓ ప్రభుద్దిడి వింత వికృతి చేష్టలను గమనించిన స్థానికులు పత్తికొండ ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు . అయ్యా ఈ భూమి పత్తికొండ మండలం పత్తికొండ గ్రామ రెవెన్యూ పరిధిలోనిది  సర్వే నెంబర్ : 203/3 లోని  2.83 సెంట్లు ప్రభుత్వ భూమి ఉందని అధికారుల ఈ భూమిని రక్షించాలని MRPS  చెందిన నాయకులు మే 29 న ఆర్డీవో కి  వినతి పత్రం అందిస్తే దానిపై ఇప్పటి దాక ఎలాంటి చర్యలు చేపట్టాక పొగ….  ఇదే స్థలాన్ని వ్యవసాయం పేరుతొ  మల్లి ఆక్రమిస్తే అధికారులు  పట్టించుకోకుండా నిర్లక్యంగా వ్యవహించడంపట్ల  ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండంలో  ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించేదేవరని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై రెవెన్యు అధికారులు చర్యలు చేపట్టక పొతే పెద్దఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో MRPS  జాతీయ  ప్రధానకార్యదరి రామకొండ వెంకటేశ్వర్లు , రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి పులికొండ , రాష్ట్ర నాయకులు   గంప నరసింహులు , ఠాకూర్ ,  తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS