దళితులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయండి : ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ బొంతల నరసింహులు

దళితులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయండి : ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ బొంతల నరసింహులు

పత్తికొండ న్యూస్ వెలుగు :

పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 128/2 నందు ఇంటి పట్టాలు ఇవ్వాలని ఆర్డీవో కి వినతిపత్రం ఇవ్వడం అయినది ఈ సర్వే నెంబర్ నందు గతంలో పత్తికొండ మండగిరి చిన్నహుల్తి దేవనబండ గ్రామాల రైతులు పండించిన ధాన్యాన్ని కళ్ళం చేసుకోవడానికి ఈ భూమి రైతులకు చాలా ఉపయోగపడేది ఈ భూమి రెవెన్యూ రికార్డులో కూడా కళ్ళం అని ఉంది కానీ ఈ భూమిని 1956లో ఒక రైతుకు డి పట్టా ఇచ్చామని పట్టా ఇచ్చినప్పటి నుంచి కూడా ఆ వ్యక్తి భూమిని సాగు చేయలేదని ఇప్పటికీ బీడుగా ఉన్నందువలన ఆ భూమిని పట్టా రద్దుచేసి రెవెన్యూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా 2019 సంవత్సరంలో నవరత్నాల పథకం కొరకు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాల కొరకు ఆ భూమిని ఇవ్వాలని నిర్ణయించడమైనది కానీ ఆ భూమిలో ఎటువంటి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు కానీ 2021 సంవత్సరంలో ఈ భూమి ఆన్లైన్ రెవెన్యూ రికార్డులో ఉన్న భూమి రిజిస్ట్రేషన్ భూమిగా మారిందని అది ఏవిధంగా రిజిస్ట్రేషన్ అయిందో మండల రెవెన్యూ అధికారులు ఈ గ్రామాల ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ బొంతల నరసింహులు డిమాండ్ చేశారు. కావున ఈ భూమిని ప్రభుత్వం వారు చెర నుండి కాపాడి వారి యొక్క ఆక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని ఈ భూమి నుండి తొలగించి ఇల్లు లేని వారికి ఇంటి స్థలాలకు ఇవ్వాలని ఈ గ్రామాలలో చాలామంది దళిత కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి వీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కావున ఆర్డీవో వీటన్నిటి పైన పూర్తిగా విచారణ చేసి ఇల్లు లేని దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు సెంట్లు చొప్పున ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ బెల్లాల లక్ష్మన్న బాలకృష్ణ, రంగన్న గోపాలు రంగస్వామి ప్రకాష్ మరియు పత్తికొండ చిన్నహుల్తి దేవనబండ మండగిరి గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS