సంగాల కురువ గిరి పై దాడి హేయమైన చర్య…

సంగాల కురువ గిరి పై దాడి హేయమైన చర్య…

కర్నూలు న్యూస్ వెలుగు: కర్నూలు జిల్లా కురువ సంఘం. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నెమకల్ గ్రామానికి చెందిన గురునాథ్ వర్గం సంగాల గ్రామానికి చెందిన కురువ గిరి ని నానా దుర్బాషలాడి, నిన్ను చంపేస్తాం నీకు దిక్కున్న చోట చెప్పుకో్మని ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్యగా కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కే. రంగస్వామి జిల్లా కోశాధికారి కే. సి.నాగన్న జిల్లా సహాయ కార్యదర్శి కే. వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆదివారం ఆలూరు లో జరిగిన విలేకర్ల సమావేశం లో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి, జిల్లా కోశాధికారి కె. సి. నాగన్న మాట్లాడుతూ సంగాల కు చెందిన కురువ గిరి పై దాడి చేసిన గురునాథ్ వర్గం వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము. కురువ కులస్థులపై దాడులు చేయడం సర్వసాధారణం అయింది. కోంతమంది నాయకులకు, కోన్ని సామాజిక వర్గాలకు చెందిన వారికి ఇది సర్వసాధారణం అయినది. మేము తప్పకుండా గుర్తు పెట్టుకోని కోట్టిన దెబ్బ తగిలిన రోజు తెలుస్తుంది. కురువ ల యొక్క భాధను ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో మాకు తెలుసు వారికి తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS