
సంక్షేమం ప్రతి అర్హ కుటుంబానికి అందేలా కృషి చేస్తా: టిడిపి నేత జానకి రామి రెడ్డి
తుగ్గలి, ఆగస్టు 02 ( వెలుగు న్యూస్ ): తుగ్గలి మండలంలోని బొల్లవానిపల్లె గ్రామంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా గ్రామంలో విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక టిడిపి నేత జానకి రామి రెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల వివరాలు ఉన్న ప్రచార పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించడంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జానకి రామి రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హ కుటుంబానికి అందేలా కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బత్తిన వెంకట్రాముడు, కొమ్ము వెంకటేష్, ఉప్పర్లపల్లి సొసైటీ చైర్మన్ అప్పా వేణు, తిరుపాల్ నాయుడు, చక్రపాణి, చంద్ర మోహన్, రాము, నాగార్జున, గుండమయ్య, నాగేష్, ఆర్ మోహన్ రెడ్డి, డి సుదర్సన్ రెడ్డి, కే వెంకట రెడ్డి, ఆర్ వేణుగోపాల్ రెడ్డి, ఆర్ హనుమంతు రెడ్డి, సంఘాల కృష్ణ, నీలా మనోహర్, ఎం.వెంకటేశ్వర రెడ్డి, ఎం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

