మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి – వై. సాయి ప్రసాద్ రెడ్డి

మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి – వై. సాయి ప్రసాద్ రెడ్డి

నిరుద్యోగ భృతి, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలి

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి

న్యూస్ వెలుగు : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వై. సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 3 వ రోజు ముగింపు కార్యక్రమం ఆదోనిలో జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యూత్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మెగా డీఎస్సీ వ్యవహారంపై వస్తున్న ఆరోపణలు, అనుమానాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నెలకు ₹3,000 నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువత తమ భవిష్యత్తుపై ఆశలు పెట్టుకుని డీఎస్సీ పరీక్షలు రాశారని, అయితే డీఎస్సీ ప్రక్రియపై అనేక అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.డీఎస్సీ వ్యవహారంలో నిజానిజాలు వెలుగులోకి రావాలంటే స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తప్పు జరగలేదని భావిస్తే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చిన ₹3,000 నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేసి మాట నిలబెట్టుకోవాలని కోరారు.అలాగే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని అన్నారు. డీఎస్సీ వ్యవహారంపై విద్యాశాఖ స్పష్టమైన సమాధానం చెప్పాలని, ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు.“నిరుద్యోగుల గొంతుకై… విద్యార్థుల భవిష్యత్తుకై… న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుంది” అని నాయకులు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ సీనియర్ రాష్ట్ర నాయకులు వెంకటేష్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జీవన్ సింగ్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నిరుద్యోగులు, విద్యార్థులు, యువత న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే మరింత ఉధృతమైన ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS