న్యూస్ వెలుగు – పత్తికొండ: పత్తికొండ పట్టణంలో మార్పు కోసం సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార పాదయాత్ర ఆరో రోజుకు చేరుకుంది. బుధవారం ఈ కార్యక్రమాన్ని పట్టణంలోని 1వ వార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలను కలుసుకుని వారి సమస్యలను

అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి యు. కారుమంచి, సిపిఐ పట్టణ కార్యదర్శి నల్లమల రామాంజనేయులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “పార్టీలకతీతంగా ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం పోరాడటమే సిపిఐ ప్రచార పాదయాత్ర ప్రధాన లక్ష్యం” అని అన్నారు. పత్తికొండ పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం జరిగే వరకు సిపిఐ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. కర్నూలు రోడ్డులోని బ్రిడ్జిపై డివైడర్లు ఏర్పాటు చేయకపోవడంతో వాహనాలు ఎదురెదురుగా వెళ్లే సమయంలో ప్రమాదాలకు అవకాశం ఉందని, ముఖ్యంగా విద్యార్థులు, పాదచారుల భద్రత దృష్ట్యా వెంటనే డివైడర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పాఠశాలల సమీపంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కొన్ని పేపర్ల ప్రకటన ద్వారా కూడా ప్రధాన రహదారుల దగ్గర పాఠశాల ముందు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేసిన ఇంతవరకు కూడా స్కూల్ ముందు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్య వైఖరి వహించడం సరైనది కాదని ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ఆర్ అండ్ బి అధికారులకు ఉందని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తూ అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు కారన్న నెట్టకంటయ్య, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు వెంకట్రాముడు, వ్యవసాయ కార్మిక సంఘం తాలూకా నాయకులు వెంకట్రామిరెడ్డి, శాఖ కార్యదర్శులు రవి, నాగేంద్ర, శంకర్, మురళి, అంజి, నాగన్న తదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!