యువత భవితకు న్యాయ దీపం: ర్యాగింగ్, మాదకద్రవ్యాలపై సమరభేరి

యువత భవితకు న్యాయ దీపం: ర్యాగింగ్, మాదకద్రవ్యాలపై సమరభేరి

కర్నూలు, న్యూస్​ వెలుగు :  స్థానిక జి. పులయ్య ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం నాడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు,  న్యాయ విజ్ఞాన వేదిక , జి. పుల్లయ్య కళాశాల వివేకానంద యువ ఫోరం సంయుక్తంగా  కళాశాల ప్రాంగణంలో “యువతలో సామాజిక బాధ్యత” అనే అంశంపై భారీ అవగాహన సదస్సు నిర్వహించాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి  బి. లీల వెంకట శేషాద్రి  మాట్లాడుతూ, “ర్యాగింగ్ అనేది చట్టరీత్యా నేరమే కాదు, ఒక విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అమానుష చర్య. సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకులుగా నిలవాలి. మాదకద్రవ్యాల వలలో పడితే యువత భవిష్యత్తు అంధకారమవుతుంది. కుటుంబానికి, సమాజానికి తీరని నష్టం” అని హెచ్చరించారు. అన్యాయానికి గురైన వారు, బాధితులు టోల్ ఫ్రీ నంబర్ 15100 ద్వారా లేదా దగ్గరలోని న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని భరోసా ఇచ్చారు.కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్  విద్యార్థులను ఉద్దేశించి ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. “ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది. తప్పనిసరిగా హెల్మెట్ ధరించండిఅది మీ కుటుంబానికి మీరు ఇచ్చే భరోసా” అని పిలుపునిచ్చారు.కళాశాల ప్రిన్సిపాల్ డా. సి. శ్రీనివాస రావు  మాట్లాడుతూ, “మా క్యాంపస్ ర్యాగింగ్ రహిత, డ్రగ్స్ రహిత ప్రాంగణంగా కొనసాగుతుంది.ఈ ప్రతిజ్ఞ ర్యాగింగ్ కు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాము అని ప్రతిజ్ఞ  చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS