పత్తికొండలో ఏపీఎంఎఫ్‌ నూతన కమిటీ ఏర్పాటు.

పత్తికొండలో ఏపీఎంఎఫ్‌ నూతన కమిటీ ఏర్పాటు.

తుగ్గలి, ఆగస్టు 16 ( వెలుగు న్యూస్ ) జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన భద్రతకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ మీడియా ఫెడరేషన్‌ (ఏపీఎంఎఫ్‌) నాయకులు పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, మీడియా ప్రతినిధులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. పత్తికొండ నియోజకవర్గ ఏపీఎంఎఫ్‌ కమిటీ నిర్మాణ మహాసభ కర్నూలు జిల్లా కన్వీనర్‌ ఎం. సాయి కుమార్‌ నాయుడు అధ్యక్షతన ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహాసభలో నియోజకవర్గ నూతన కమిటీని ప్రకటించారు. ఏపీఎంఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.మద్దులేటి, జిల్లా కన్వీనర్‌ ఎం.సాయి కుమార్‌ నాయుడు, జిల్లా కో-కన్వీనర్లు ఆర్‌.బాలకృష్ణ, కె.రంగనాథ్‌, బి.రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. పత్తికొండ నియోజకవర్గ ఏపీఎంఎఫ్‌ అధ్యక్షుడిగా మద్దికేర శేఖర్‌ గౌడ్‌, ఉపాధ్యక్షుడిగా చెరువు సురేష్, కార్యదర్శిగా వి.వి.నాయుడు, కోశాధికారిగా విష్ణువర్ధన్‌ గౌడ్‌ను ప్రకటించారు. మండల ఉపాధ్యక్షులుగా బి. రంగన్న, రాం ప్రతాప్‌ గౌడ్‌, సి.రాము, పి.రాజు, మహేష్‌, వి.నాగార్జున, రామాంజనేయులు లను నియమించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులకు సహచర పాత్రికేయులు అభినందనలు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS