శ్రీఆంజనేయునికి కుంభోత్సవం

శ్రీఆంజనేయునికి కుంభోత్సవం

ఆలూరు : హొళగుంద మండల కేంద్రంలో  శ్రీ అగ్రహారం ఆంజనేయ స్వామి,కోట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాస మొదటి శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించినట్లు ఆలయ పూజారులు వెల్లడించారు.  ఉదయం నుంచి స్వామివారికి జలభిషేకం,పంచామృత అభిషేకం,బిల్వార్చన,ఆకుపూజ ,దేవునికి పెద్ద ఎత్తున పూల మాలతో అలంకరించారు. స్వామివారిని దర్శించుకున్న  మొక్కులు  తీర్చుకుని పూజలు నిర్వహించారని ఆలయ పండితులు పేర్కొన్నారు . దేవాలయనీకి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే శ్రావణమాసం మూడో శనివారం సందర్భంగా దేవునికి ఊరు చివరన భావి గంగా మాతకు పూజ చేసి అక్కడ నుంచి కుంభవసం దేవాలయం వరకు డోలు , భక్తి శ్రద్ద తో  కుంభోత్సవ కార్యక్రమాన్ని  ఆంజనేయ స్వామికి నిర్వహిచారు.

Author

Was this helpful?

Thanks for your feedback!