మదర్ థెరిసా అందరికీ ఆదర్శం : వైఎస్ జగన్
అమరావతి : పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్టువ్యాధి గ్రస్తులూ, అనాథ పిల్లలే తన ఆస్తిగా భావించి వారందరినీ అక్కున చేర్చుకున్న మానవతా మూర్తి మదర్ థెరిసా అని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఎంతో మంది అనాథలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాదు అనాథ, పేద పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి వారి భవిషత్తుకు బంగారు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి ఆమె అని కొనియాడారు. మేము అదికారంలో ఉన్నపుడు విజయవాడ నగరంలోని నిర్మల్ హృదయ్ భవన్ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా వారికి సహాయ సహకారాలు అందించామన్నారు. ఆ భవనం కాంప్లెక్స్‌ను ఆరోజు నేను ప్రారంభించండం సంతోషంగా ఉందని . నేడు మదర్ థెరిసాగారి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!