గుడ్లవల్లేరు ఘటనలపై విచారణ ఎక్కడ ..? డివైఎఫ్ఐ

గుడ్లవల్లేరు ఘటనలపై విచారణ ఎక్కడ ..? డివైఎఫ్ఐ

గుడ్లవల్లేరు ఘటనలపై విచారణ ఎక్కడ ..?

రేప్ కేసు నుండి సజ్జన్ జిందాల్ నీ రక్షించిన ఐపీఎస్ లను సస్పెండ్ చేయాలి- డివైఎఫ్ఐ

జమ్మలమడుగు (న్యూస్ వెలుగు ): గుడ్లవల్లేరు ఘటనలపై సమగ్రమైన విచారణ చేయాలని రేప్ కేసు నుండి సజ్జన్ జిందాల్ నీ రక్షించడానికి ముంబై నటి జత్వానీ ఆమె కుటుంబాన్ని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించిన ఐపీఎస్ లను సస్పెండ్ చేయాలని ఈ నిర్బంధంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎల్లయ్య తులసిశ్వర్  డిమాండ్ చేశారు. జమ్మలమడుగు స్థానిక ఎన్జీవో కార్యాలయం లో విలేకరులతో మాట్లాడుతూ….. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హెడేన్ కెమెరాల ఘటనపై నిష్పక్షపాత విచారణ చేసి ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

అలాగే అక్క చెల్లెమ్మలకు ఫోన్ చేసిన ఐదు నిమిషాలకే రెస్పాండ్ అయి అత్యాచార ఘటనల్లో లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తులపైన చర్యలు తీసుకుంటామని అందుకోసమే దిశ చట్టం చేశామని గొప్పలు చెప్పిన జగన్ ప్రభుత్వం ఒక అత్యాచార ఘటనలో బడా పారిశ్రామిక వేత్త సజ్జన్ జిందాల్ ముంబై నటి జత్వానీ పై అత్యాచారము చేస్తే రేప్ కేసును ఉపసంహరించుకోవడానికి నటి జత్వానిపై నిర్బంధాన్ని ప్రయోగించి దుర్మార్గంగా వ్యవహరించారని తెలిపారు. ఆమె ముంబై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోకపోతే కోర్టుకు వెళ్లి రేప్ కేస్ రిజిస్టర్ చేయించిందని తెలిపారు. సజ్జన్ జిందాల్ ను కాపాడడానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వారి కృష్ణా జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆమెపైన అక్రమంగా ఫోర్జరీ కేసు నమోదు చేసి కేసు పెట్టిన వెంటనే ఆగమేఘాల మీద ముంబై కి ఫ్లైట్లో వెళ్లి ఆమెను ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి, ఆమెకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నింటిని సీజ్ చేసి, ఆమె బ్యాంక్ అకౌంట్లు అన్నింటిని ఫ్రీజ్ చేసి భారీగా నిర్బంధం చేసి ఆమె చేత హత్యాచార కేసును ఉపసంహరించుకోమని భారీగా ఒత్తిడి చేశారు. ఆమె ఒప్పుకోకపోవడంతో సబ్ జైలుకు పంపించి ఆమె న్యాయం పొందడానికి కానీ, ఆమెకు తెలిసినవారికి సమాచారం ఇవ్వడానికి కానీ అవకాశం ఇవ్వకుండా జైల్లో నిర్బంధించి సజ్జన్ జిందాల్ పై పెట్టిన రేప్ కేసును ఉపసంహరించుకునే వరకు ఆమెకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా నిర్బంధించడంతో దిక్కుతోచని పరిస్థితిలో వైట్ పేపర్ ల పైన సంతకాలు చేస్తే విడుదల చేయిస్తాం అని పోలీస్ అధికారులు చెప్పడంతో బైలిప్పించి విడుదల చేశారు. ఈ తీవ్రమైన నేరాన్ని బయట పెట్టడం ద్వారా ఆమె ఆమె తల్లిదండ్రులు ప్రాణహాని ఉందని భయంతో ఇంతవరకు బయట పెట్టలేదు ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు అని ఆమెపై పెట్టిన నిర్బంధాన్ని బయట పెట్టిందని తెలిపారు. ఎవరైతే ముంబై నటి జత్వానిని అక్రమంగా నిర్బంధించరో ఆ ఐపీఎస్ లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయినా ఇతర అధికారులను రాజకీయ నాయకులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మహిళలకు చెప్పే మాటలు చేసే పనులు ఈ ఘటనతో బహిర్గతం అయ్యాయని ఆరోపించారు.సమావేశంలో పట్టణ సహాయ కార్యదర్శి మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!