ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు

జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు : జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి. చంద్రశేఖర్  ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండు  మూడవ సంవత్సర విద్యార్థులు వెల్కమ్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలికి అత్యున్నత స్థానాలకు వెళ్లాలని విద్యార్థులకు సందేశాన్ని ఇచ్చారు. అలాగే వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ .సి .సంజీవరెడ్డి  మాట్లాడుతూ విద్యార్థులు యొక్క గమ్యస్థానాలను ఏ విధంగా సాధించాలి అని విద్యార్థులకు వివరించారు. అలాగే ప్రోగ్రాం ఇన్చార్జి డాక్టర్ ఎం .సుధీర్ రెడ్డి  మాట్లాడుతూ కొత్తగా చేరిన విద్యార్థి కళాశాలలో ఎలా ప్రవర్తించాలి ,ఎలా మెలగాలి అధ్యాపకులను గౌరవించాలన్నారు. పి. డి. షఫీ, అధ్యాపకులు, ఆఫీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!