హిందువుల మనోభావాలను అత్యంత ఘోరంగా దెబ్బతీశారు
తిరుపతి, న్యూస్ వెలుగు; రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మాదిరిగా గతంలో ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో తిరుమల పరమ పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం ముఖ్యంగా లడ్డులో జంతువుల కొవ్వు, నెయ్యి బదులుగా వాడినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన ప్రకారం తెలుస్తోంది. ఇటువంటి పనులు చేసి హిందువుల మనోభావాలను అత్యంత ఘోరంగా దెబ్బతీయడం జరిగింది స్వచ్ఛమైన శాఖాహారం లో మాంసాహారాన్ని ఏ విధంగా కలుపుతారని , పరమ పవిత్రమైన గోవును అవమానం చేయడం వంటి హిందూ వ్యతిరేకమైన చర్యలు చేపట్టిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎంత పెద్ద వారైనా చర్యలకు వెనకాడకూడదని ఇది దేశ మొత్తానికి అప్రతిష్ట కలిగే చేసిన విషయంగా మారిందని హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ అధ్యక్షులు మహేష్ డేగల మరియు రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు కురువ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వము పూర్తి విషయాన్ని విచారణ చేసి హిందువుల పై జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను ప్రజలు తెలుసుకునే విధంగా మేల్కొల్పాలని పిలుపునిచ్చారు