విజయవాడ, న్యూస్ వెలుగు;  శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం దేవస్థానంలో నిర్వహించు దసరా మహోత్సవములు -2024 పురస్కరించుకొని ఆదివారం  ఆల

య ఈవో కె ఎస్ రామరావు నగర పోలీస్ ఏడిసిపి రామకృష్ణ ఆలయ ఇంజినీరింగ్ అధికారులు  I టౌన్ పోలీస్ సిబ్బంది తో కలిసి అమ్మవారి దర్శనార్థం విచ్చేయు భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు చేయుచున్న ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సూచనలిచ్చారు. ఇందులో భాగముగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ఘాట్ రోడ్ నందు జరుగుచున్న మరమ్మత్తు పనులు ను పరిశీలించి, ఓం టర్నింగ్ నుండి ఉచిత, రూ.100, రూ.300, రూ.500 క్యూ లైన్ లు, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ లు, విఐపి లైన్, దేవస్థానం లోపలి క్యూ లైన్ లు, కౌంటర్లు, ఉభయదాతల క్యూ లైన్ లు, తదితర ఏర్పాట్లు గురించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ లింగం రమ, ఇంజినీరింగ్ సిబ్బంది  ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!