న్యూస్ వెలుగు ఒంటిమిట్ట.01 : కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఒంటిమిట్ట మండలం నరవకాటి పల్లి పంచాయతీ రైల్వే స్టేషన్ కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ పథకాలలో భాగంగా అవ్వతాత

లకు అందిస్తున్న పెన్షన్ను మంగళవారం గ్రామంలోని వృద్ధులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ సంక్షేమములో అభివృద్ధి కనపడడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు గఫార్ రహిమాన్, వెంకటయ్య, సుబ్బయ్య,, గోవిందు, గ్రామ వాలంటరీ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
.
-
Y.Bala guru natha sarma , Vontimitta kadapa District devotional writings
View all posts
Thanks for your feedback!