పాఠశాలలకు విజయదశమి సెలవులు : విద్యాధికారి రమా వెంకటేశ్వర్లు
అక్టోబర్ 14న పాఠశాలలు పునః ప్రారంభం
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల పరిధిలోని గల అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు అక్టోబర్ 2 బుధవారం నుండి అక్టోబర్ 13వ తేదీ ఆదివారం వరకు విజయదశమి సెలవులను ప్రకటించడమైనదని మండల విద్యాధికారి రమా వెంకటేశ్వర్లు తెలియజేశారు. మంగళవారం రోజున స్థానిక ఎంఆర్సి కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు విజయదశమి సెలవులని,14న పాఠశాలలు సెలవుల అనంతరం పునః ప్రారంభం అవుతాయని మండల విద్యాధికారి రమా వెంకటేశ్వర్లు తెలియజేశారు. విజయదశమి సెలవులలో పాఠశాలల నిర్వహకులు ఎవరుగాని తరగతులను నిర్వహించకూడదని మండల విద్యాధికారి రమా వెంకటేశ్వర్లు తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!