హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో నేరణికి,నేరణికి తండా,కొ

త్తపేట గ్రామ ప్రజల ఆరాధ్యదైవం శ్రీ మాళ సహిత మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహా మూర్తులు,స్వామి అమ్మవార్ల పల్లకి సోమవారం నేరణికి గ్రామం నుంచి దేవరగట్టు శ్రీ మాళ మల్లేశ్వరస్వామి దేవాలయానికి చేరాయి.అలాగే సాయంత్రం స్వామి సన్నిధిలో మూడు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పురోహితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీ మాత మాళమ్మ,మల్లేశ్వరస్వామికి కంకణాధారణ,స్వామి అమ్మవార్ల నిశ్చితార్థ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.అలాగే ఉదయం నుంచి స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున పూలమాలలతో అలంకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,మూడు గ్రామాల ప్రజలు పూజారి గిరి స్వామి మల్లయ్య స్వామి మల్లయ్య స్వామి రవి శాస్త్రితదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!